Share News

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:53 PM

వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..
Wanaparthy

వనపర్తి జిల్లా: విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ప్రమాదవశాత్తూ నాటు బాంబులు పేలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..

గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. పశువులు మేస్తుండగా చెట్టు కింద తీరేందుకు అటు వైపుగా వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తూ బాంబులపై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలి తీవ్రంగా గాయపడ్డాడు శేఖర్. ప్రమాదాన్ని గమనించిన వ్యవసాయ కూలీలు, రైతులు హుటాహుటిన అతణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి?, స్థానికంగానే ఎవరైనా తయారు చేస్తున్నారా లేదా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చారా? అనే పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన గ్రామంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

Updated Date - Mar 29 , 2026 | 06:16 PM