Share News

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:12 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు వివరించారు.


మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అధికారులు. గోసంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని మేనకా బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.


రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు రేవంత్. ఈ సందర్భంగా జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కృషిని ప్రశంసిస్తూ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ కుటుంబం.. అసలేం జరిగిందంటే..

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Updated Date - Mar 29 , 2026 | 06:05 PM