రూ.25 లక్షల స్త్రీనిధి సొమ్ము స్వాహా
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:26 AM
మహిళా సంఘాల సభ్యులు స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించి చెల్లించిన వాయిదాల సొమ్ము పక్కదారి పట్టింది.
సోషల్ ఆడిట్‌లో బయటపడిన గ్రామదీపిక చేతివాటం
ఏన్కూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యులు స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించి చెల్లించిన వాయిదాల సొమ్ము పక్కదారి పట్టింది. ఏకంగా రూ.25 లక్షల నిధులను ఓ గ్రామదీపిక సొంత అవసరాలకు వినియోగించుకున్న వ్యవహారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడలో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో భాగంగా, రేపల్లెవాడలోనూ రెండు రోజులుగా స్త్రీనిధి రుణాల లావాదేవీలను అధికారులు పరిశీలించారు.
ఈ క్రమంలో మహిళా సంఘాల సభ్యులు ప్రతినెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ, ఆ నగదును సంబంధిత ఖాతాల్లో జమచేయకుండా గ్రామదీపిక రమాదేవి సొంత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సోమవారం నిర్వహించిన గ్రామసభలో సుమారు రూ.25 లక్షల నగదును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నానని రమాదేవి అంగీకరించినట్లు స్త్రీనిధి మేనేజర్ వేణుగోపాలచారి వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News