Share News

సోలార్‏కు పెరుగుతున్న ఆదరణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:49 PM

పెరిగిపోతున్న విద్యుత్‌ చార్జీలు ఈ పరిస్థితులను అధిగమిం చేందుకు జిల్లా ప్రజలు సౌరశక్తి వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు.

సోలార్‏కు పెరుగుతున్న ఆదరణ
PM Surya Ghar

  • విద్యుత్‌ బిల్లులకు..సౌరశక్తితో చెల్లు

  • రాయితీతో పీఎం సూర్యఘర్‌

  • సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

భీమిని(మంచిర్యాల): పెరిగిపోతున్న విద్యుత్‌ చార్జీలు ఈ పరిస్థితులను అధిగమిం చేందుకు జిల్లా ప్రజలు సౌరశక్తి వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కప్పుడు సరైన అవగాహన లేక సౌర విద్యుత్తును వినియోగించుకున్న వారు తక్కువే. దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోత్సహిస్తుం డటంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. గ్రామాల్లో సైతం తమ ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ ప్యానెల్స్‌ బిగించుకుని విద్యుత్తును వాడుకుంటున్నారు. ఏసీలు, గ్రీజర్లు తదితర సోలార్‌ విద్యుత్‌ ద్వారా విని యోగిస్తున్నారు. ఎప్పుడూ ప్యాన్లు తిరుగుతున్నా, లైట్లు వెలుగుతున్నా జీరో బిల్లే వస్తుంది. పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా సౌరశక్తి అధిక బిల్లులు రాకుండా అడ్డుకుంటోంది.


పీఎం సూర్యఘర్‌ ఉపయోగాలు...

ఈ పథకం ద్వారా ప్రతీ నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ లభిస్తుంది. 2 కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు వరకు సబ్సిడీ అందిస్తారు. ఇంటి అవ సరాలకు పోనూ మిగిలిన విద్యుత్‌ను తిరిగి సంస్థకు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకంలో ఈవీ వాహనాలను సైతం ఛార్జింగ్‌ చేసుకునే వెసులు బాటు ఉంటుంది.


దరఖాస్తు విధానం ఇలా..

కేంద్రం పీఎం సూర్యఘర్‌ బిజిలీ యోజన రాయితీ ఇచ్చే సౌరశక్తి యూనిట్లను పోత్సహిస్తుంది. పీఎం సూర్యఘర్‌. జీఓవి.ఐన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే త క్షణమే కార్యచరణ మొదలవుతుంది. తక్కువ వ్యవధిలో ఇంట్లో ప్యానెల్స్‌ అమర్చుకోవచ్చు. గరిష్ఠంగా రూ. 78 వేల రూపాయల రాయతీ వస్తుండగా తక్కువ వడ్డితో బ్యాంకు రాణాలు కూడా పొందవచ్చు.


xx.jpgయూనిట్ల లెక్కలన్నీ ఫోన్‌లో ప్రత్యక్ష్యం..

సౌర విద్యుత్తు వినియోగం సమాచారం ఫోన్‌కు వ స్తుంది. రోజూ వారీ ఉత్పత్తి అయిన విద్యుత్తు ఎంత? వచ్చిన ఆదాయం ఎంత? తెలుస్తుంది. విద్యుత్‌ సంస్థ తీ సుకున్న సౌర విద్యుత్‌కు ఏడాదికి రెండు సార్లు (జన వరి-జూన్‌, జూలై-డిసెంబరు) మీటర్‌ ద్వారా లెక్కించి యూనిట్ల ఆధారంగా డబ్బులు ఉత్పత్తిదారులకు చెల్లిస్తారు.


ఖర్చు, రాయితీ, ఉత్పత్తి వివరాలు

2 కిలోవాట్ల యూనిట్ల సామర్థ్యం వ్యయం1.60 లక్షలు దీనికి రాయితీ 60 వేలు ఇది నెలకు 240 యూనిట్ల వరకు ఉత్పత్తి చేస్తుంది.

3 కిలోవాట్ల యూనిట్‌ సామర్థ్యం వ్యయం 2.16 లక్షలు దీనికి రాయితీ 78 వేలు ఇది నెలకు 360 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.

4 కిలోవాట్ల యూనిట్‌ సామర్థ్యం వ్యయం 2.67 లక్షలు కాగా దీనికి రాయితీ 78 వేలు ఇది నెలకు 480 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.

5 కిలోవాట్ల యూనిట్‌ సామర్థ్యం వ్యయం 3.25 లక్షలు అవుతుంది దీనికి రాయితీ 78 వేలు ఇది నెలకు 600 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.


రైతులకు పీఎం కుసుమ్‌ పథకం..

సొంత భూమిని కలిగి ఉండి ఇప్పటికే బోరు బావి ఇతర సాగునీటి వనరులు కలిగి ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్‌ పథకం ద్వారా 3 హెచ్‌పీ నుంచి 10 హెచ్‌పీ వరకు సోలార్‌ పంప్‌ సెట్లకు సబ్సిడీ అంది స్తోంది. ఈ ప్యానెళ్లకు 25 ఏళ్ల వరకు గ్యారెంటీ ఉండటం తో పాటు పగటి పూట దాదాపు 8 గంటల పాటు ఉచి తంగా మోటార్లు నడుస్తాయి. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.50 లక్షల ఆదాయం పొందవచ్చు. సరైన మార్గదర్శకాలు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని త్వరిత గతిన అమలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ప్రజలు ఉపయోగించుకోవాలి..

  • దాసరి మనోహర్‌ గౌడ్‌, తాండూర్‌

ఆసక్తి గల ప్రజలు పీఎం సోలార్‌ సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్‌ ఖర్చుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పథకం ఎంతో ఉపయో గ పడుతుంది. ఈ పథకంలో మిగులు విద్యుత్‌ను ప్రభుత్వమే విద్యుత్‌ కొనుగోలు చేస్తూ గృహావసరాలకు వాడుతూ ఆదాయం పొందవచ్చు. ఇప్పటి వరకు తాండూర్‌, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో 55 వరకు సౌర విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాము.

Updated Date - Oct 10 , 2026 | 01:49 PM