Share News

కొండగట్టులో చందనోత్సాదన- మహా సంప్రోక్షణ

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:53 AM

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్టుకు చందనోత్సాదన(సింధూరం తొలగింపు) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

కొండగట్టులో చందనోత్సాదన- మహా సంప్రోక్షణ
Kondagattu Temple

మల్యాల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్టుకు చందనోత్సాదన(సింధూరం తొలగింపు) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 20వరకు మహా సంప్రోక్షణ తదితర విశేష క్రతువులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బాలాలయంలో కలపతో తయారు చేసిన ఉత్సవమూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.


స్వామి వారి మూలవిరాట్టుపై ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన సింధూరం తొలగింపునకు బంగారం, వెండి, రాగి తదితర పంచలోహాలతో పాటు దేవతావృక్షాలైన జువ్వి, ధరమి, మర్రి, మేడి, తదతర చెట్ల కర్రతో ప్రత్యేకంగా పరికరాలు తయారు చేశారు. చందనపు పొరలను తొలగించాక ఈ నెల 21 నుంచి 40 రోజుల పాటు భక్తులకు అంజన్న నిజరూప దర్శనం లభించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:55 AM