Share News

వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:39 AM

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.

వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు ప్రమాణస్వీకారం
Juvvadi Narsinga Rao

  • పాల్గొన్న పలువురు మంత్రులు

కోరుట్ల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, వివిధ జిల్లాల వెలమ సంఘ సభ్యులు, కాంగ్రెస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వెలమ కార్పొరేషన్‌ను ప్రకటించి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావును చైర్మన్‌గా ప్రకటించారు. దీంతో నర్సింగరావుతో హైదరాబాద్‌లో అదికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాయకుడు కేవీపీ రాంచందర్‌రావు, ఎంపీ కిరణ్‌ కుమార్‌ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింగరావును వివిధ జిల్లాల వెలమ సంఘ నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు, జువ్వాడి మిత్ర బృంద సభ్యులు, మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ,, వెలమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:39 AM