ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలం: బండి సంజయ్
ABN , Publish Date - May 26 , 2026 | 08:31 PM
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొంటూ.. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వానివా, రాష్ట్ర ప్రభుత్వానివా అన్న విషయంపై సమాధానం చెప్పాలన్నారు. ధాన్యం రవాణా ఖర్చులను కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తోందన్నారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇకనైనా బేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని కోరారు. అలాగే అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా 'రైతు గోస – బీజేపీ భరోసా' పేరుతో యాత్రలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ
Read Latest TG News