Share News

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:31 PM

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay

కరీంనగర్, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదన్నారు. అర్థంలేని ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘సర్’ విషయంలో కాంగ్రెస్ గందరగోళం చేస్తోందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ వాళ్లకు ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇతర దేశాల వారి ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని కేంద్ర మంత్రి నిలదీశారు.


మావోయిస్టులు ఇక లేరు..

మావోయిస్టులు చివరికి సాధించింది ఏంటి అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తుపాకీ గొట్టంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. అభం శుభం తెలియని మైనర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరికి మావోయిస్టు సంస్థని నిషేధానికి గురయ్యేలా చేశారని వ్యాఖ్యానించారు. తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేమని మావోయిస్టు అగ్ర నేతలు కూడా గుర్తించారని.. కేంద్రానికి సహకరించి చాలామంది లొంగిపోయారన్నారు. మావోయిస్టులు ఇక లేరని అన్నారు. మావోయిస్టు భావజాలంతో ఏదైనా సాధిద్దాం అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఆ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 12:52 PM