Share News

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:04 AM

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 కొంకరి నరహరి ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
ACB raids Telangana

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్-2 కొంకరి నరహరి ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. చార్మినార్‌తో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.


సోదాల్లో భాగంగా భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ల్యాండ్ డాక్యుమెంట్‌లు, బంగారు ఆభరణాలతో పాటు రూ.1.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నరహరితో పాటు ఆయన తమ్ముడి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. తమ్ముడి ఇంట్లోనూ భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలపై అన్నదమ్ముల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.


ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్‌గా నరహరి కీలక విధులు నిర్వహిస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనం వంటి కీలక ఉద్యోగ బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాకి ఏడీగా కొంకరి నరహరి పనిచేశారు. దీంతో ఆ సమయంలో కూడా భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు

తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 11:12 AM