తెలంగాణలో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. స్కూల్, కాలేజ్ బస్సులపై ఫోకస్
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:40 AM
తెలంగాణలో ఆర్టీవో అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కూల్, కాలేజ్ బస్సులను రంగారెడ్డి ఆర్టీవో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి.
హైదరాబాద్, జూన్ 16: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కొందరు విద్యార్థులు బస్సుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయా బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్టీవో అధికారులు దృష్టిసారించారు. ఈరోజు(మంగళవారం) లంగర్ హౌస్ టిప్పుఖాన్ పూల్ వద్ద అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. స్కూల్, కాలేజ్ బస్సులను రంగారెడ్డి ఆర్టీవో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. బస్సుల్లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులపై అధికారులు ఆరా తీశారు.
డ్రైవర్ల లైసెన్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు స్వయంగా పరిశీలించారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లతో బస్సులు నడపించవద్దని విద్యాసంస్థలకు ఆర్టీవో ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ఉదయం 3 బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేశారు. సుమారు 60 బస్సులను తనిఖీ చేయగా... నిబంధనలు పాటించని 6 బస్సులపై చలాన్లు విధించారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమని.. మరో వారం రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని ఎమ్‌వీఐ(MVI) అవినాష్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
Read Latest Telangana News And Telugu News