Share News

వారంలో యాదాద్రి ప్లాంట్‌కు బెంగాల్‌ బొగ్గు

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:18 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్)లోని రెండో దశలో చేపట్టిన 1600 మెగావాట్ల ప్లాంట్లకు(ఒక్కోటి 800 మెగావాట్ల)కు కోలిండియాకు చెందిన అనుబంధ కంపెనీలు బొగ్గును అందించనున్నాయి.

వారంలో యాదాద్రి ప్లాంట్‌కు బెంగాల్‌ బొగ్గు
Yadadri Thermal Power Plant

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్)లోని రెండో దశలో చేపట్టిన 1600 మెగావాట్ల ప్లాంట్లకు(ఒక్కోటి 800 మెగావాట్ల)కు కోలిండియాకు చెందిన అనుబంధ కంపెనీలు బొగ్గును అందించనున్నాయి. ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్‌ (పశ్చిమ బెంగాల్‌), మహానది కోల్‌ ఫీల్డ్‌ (ఒడిసా)ల నుంచి వారం రోజుల్లో బొగ్గు చేరనుంది.


నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో మొత్తం 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు ప్లాంట్లు ఉండగా.. అందులో మొదటి దశలో మూడు యూనిట్లకు సింగరేణి నుంచి బొగ్గు అందనుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:18 AM