Share News

భక్తజనసంద్రంగా యాదగిరి క్షేత్రం

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:04 AM

వరుస సెలవుల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

భక్తజనసంద్రంగా యాదగిరి క్షేత్రం
Yadadri Temple

వరుస సెలవులతో పెరిగిన రద్దీ

యాదాద్రి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట భక్తజనసంద్రంగా మారింది. వరుస సెలవులు కావడంతో 40వేల మందికిపైగా భక్తులు లక్ష్మీనరసింహులను దర్శించుకున్నారు. ఆలయ మాడ వీధులు, ప్రాంగణం, దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి ధర్మ దర్శన క్యూలైన్లలో 3 గంటలు, ప్రత్యేక దర్శన క్యూలైన్లలో గంట పాటు భక్తులు నిరీక్షించారు. వివిధ కైంకర్యాల ద్వారా స్వామివారికి ఆదివారం రూ.51,08,288 ఆదాయం సమకూరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారు గణపయ్య

రావయ్యా గణపయ్యా..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 07:04 AM