Share News

మీడియా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:35 AM

అన్ని మీడియా సంస్థల్లోనూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సులో ప్రతినిధులు తీర్మానించారు.

మీడియా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలి
POSH Act Media Houses

  • నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యమివ్వాలి

  • మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సు డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అన్ని మీడియా సంస్థల్లోనూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సులో ప్రతినిధులు తీర్మానించారు. జర్నలిస్టులకు రక్షణ చట్టం తో పాటు ఉచిత న్యాయసహాయం అందించాలని కోరారు. ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ), తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం సంయుక్త నిర్వహణలో బేగంపేటలో మహిళా పాత్రికేయుల జాతీయ సదస్సు రెండో రోజు... సీనియర్‌ జర్నలిస్టు ఉమా సుధీర్‌ మాట్లాడుతూ.. ప్రతి జర్నలిస్టు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.


ఏఐను బాధ్యతాయుతంగా వినియోగించాలని, మానవ విచక్షణకు, క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు ప్రాధాన్యమివ్వాలని న్యూస్‌ మీటర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఖనీజా గగారి పాత్రికేయులకు సూచించారు. ఇవాల్టి పాత్రికేయం ప్రజాస్వామ్య విలువలకంటే టీఆర్పీలు, క్లిక్‌లు, లైకులు, వైరల్‌ న్యూస్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఓయూ జర్నలిజం విశ్రాంత ప్రొఫెసర్‌ పద్మజా షా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా పాత్రికేయులకు సంపాదకీయ నాయకత్వ స్థానాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలని, ఇళ్ల స్థలాల కేటాయింపు చేపట్టాలని కోరుతూ పలు తీర్మానాలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సదస్సు ముగింపు సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్‌ అలీ, ఐజేయూ అధ్యక్షుడు బల్వీందర్‌ సింగ్‌, కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్‌ ఆయోషా ఖానుమ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

సింగరేణిని కాపాడుకోవాలి

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:35 AM