Share News

ఉరి వేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:02 AM

వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయి‌బాబా కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఉరి వేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Vikarabad Woman Constable Incident

వికారాబాద్, ఫిబ్రవరి 28: వికారాబాద్(Vikarabad) పట్టణంలోని గంగారం సాయి‌బాబా కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌(Kotpally Police Station)లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య(28) తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దివ్య ఉరి వేసుకోవడానికి గల కారణాలు ఏమిటి.. ఎవరైనా వేధించారా? పని ఒత్తిడి ఏమైనా ఉందా? కుటుంబ కలహాలా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 11:14 AM