Share News

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అనేది మోదీ భావన: వీహెచ్

ABN , Publish Date - May 13 , 2026 | 03:52 PM

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్‌ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అనేది మోదీ భావన: వీహెచ్
V Hanumanth Rao

హైదరాబాద్, మే 13: మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు(వీహెచ్) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని మోదీ భావిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్‌ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకోకపోవడంతో రాహుల్ గాంధీ లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధానికి రాహుల్ లేఖ రాయడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.


మోదీకి అనుకూలంగా ఉన్న వాళ్లను సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తారా అని వీహెచ్ ప్రశ్నించారు. భజన చేసే వాళ్లకే మోదీ.. పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోందని మండిపడ్డారు. జనగణనలో బీసీ కాలమ్ లేకపోవడం అన్యాయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో నరేంద్ర మోదీ కీలు బొమ్మగా మారారని దుయ్యబట్టారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అబద్ధమని... బీజేపీ వికాసం మాత్రమే జరుగుతోందని వీహెచ్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

బండి భగీరథ్‌ను తప్పించే అవసరం మాకు లేదు: మహేశ్ కుమార్ గౌడ్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2026 | 04:07 PM