Share News

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్

ABN , Publish Date - May 13 , 2026 | 02:48 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్.. పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయ్యింది.

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్
Bandi Bhageerath

హైదరాబాద్, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్.. పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయ్యింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు.


ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లను పోలీసులు జోడించారు. BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్‌ వేశారు. రేపు(గురువారం) ఈ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయనుంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

బండి భగీరథ్‌ను తప్పించే అవసరం మాకు లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2026 | 03:05 PM