హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 13 , 2026 | 12:43 PM
హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీకొట్టింది.
హైదరాబాద్, మే 13: నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈరోజు(బుధవారం) మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు మౌలాలికి చెందిన గణేశ్, గంగాధర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ప్రతిరోజు కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాచారం పోలీస్ స్టేషన్ వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్
ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత
Read Latest Telangana News And Telugu News