తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గాయం.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:38 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాలుకు ప్రమాదవశాత్తు గాయం తగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కథలాపూర్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీనివాస్‌కు.. స్టేజ్ ఎక్కే సమయంలో ఈ గాయం తగిలింది.
రాజన్న సిరిసిల్లా, నవంబర్ 11: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కథలాపూర్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ కార్యక్రమంలో స్టేజ్ ఎక్కే సమయంలో ఆది శ్రీనివాస్ కాలుకు ప్రమాదవశాత్తు గాయం తగిలింది. వెంటనే అప్రమత్తమైన పార్టీ శ్రేణులు.. ఆయన్ను చికిత్స నిమిత్తం వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ఆవిర్భావం
లండన్ బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర