Share News

ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ఆవిర్భావం

ABN , Publish Date - Nov 10 , 2026 | 07:24 PM

ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజంలో క్రియాశీలకంగా మరో సంఘం అరంగేట్రం చేసింది.

ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ఆవిర్భావం
Telugu Diaspora Forum

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజంలో క్రియాశీలకంగా మరో సంఘం అరంగేట్రం చేసింది. తెలుగు డయాస్పోరా ఫోరంగా గత కొన్ని నెలలుగా చాపకింద నీరులా అప్పుడప్పుడూ తెరపైకి వస్తున్న టి.డి.ఎఫ్ ఎట్టకేలకు అవిషృతమైంది. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉండే ఖతర్‌లోని తెలుగు సమాజంలో ఆసక్తికరంగా మహాభారత నాటకాన్ని ప్రదర్శనతో టి.డి.ఎఫ్ లాంఛనంగా మొదలయింది.

1.jpg


సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పౌరాణిక గాథలను ప్రతిబింబించే మహాభారత నాటకాన్ని తెలుగు డయాస్పోరా ఫోరం తన ఆవిర్భావ సభలో ప్రదర్శించగా, స్థానిక ఎన్నారైలు అంజనేయులు దుర్యోధనుడిగా, నార్నె కల్యాణ్ శకుని మామగా తమ అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరి నటనకు ఆకర్షితులైన సభికులు ప్రదర్శన అనంతరం సుయోధనుడు, శకుని పాత్రధారులతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

కార్యక్రమ వ్యాఖ్యాతగా స్వప్న చౌదరి వ్యవహరించగా, గాయని మానస ఆచార్య, గాయకుడు హరి గుంట ప్రేక్షకులను సంగీత లోకంలో విహరింపజేశారు. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

2.jpg


అధ్యక్షుడు శాంతయ్య యలమంచిలి నాయకత్వంలో, ఉపాధ్యక్షుడు రవీంద్ర మాగులూరి క్రియాశీలక పాత్రతో ప్రధాన కార్యదర్శి కవీంద్ర గాలి సమన్వయంతో, రమేష్, అనిల్ కుమార్ మలసాని, GMMS నాయుడు, యాసిన్ తదితరుల సహకారంతో కార్యక్రమం నిర్వహించినట్లుగా నిర్వహకులు తెలిపారు.

మనిషి ఎలా జీవించాలో రామాయణం నేర్పిస్తే మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదో కళ్లకు కట్టేలా జీవిత సత్యాన్ని బోధించే మహాభారతం నాటకం ద్వారా ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ప్రస్థానం మొదలయింది.

మహాభారతంలో కేవలం తన నీతిబలం, రాజకీయ వ్యూహంతో అధర్మం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని ఓడించి పాండవులకు విజయాన్ని చేకూర్చిన శ్రీ కృష్ణుడి పాత్రధారి ఇక్కడ ఎవరో తెలియదు, అలాగే శకుని ఎవరో కూడా తెలుసుకోవడం ఖతర్‌లో అంత సులవు కాదు.

3.jpg4.jpg


ఈ వార్తలనూ చదవండి:

శంకరనేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో 'మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ 2026'.. నిధుల సమీకరణ

జీవితమంతా సౌదీలో గడిపి చివర్లో సోంత ఊరు నర్సాపురానికి..

Updated Date - Nov 10 , 2026 | 11:10 PM