రైతులకు బీజేపీ శనిలా తయారైంది: వేముల వీరేశం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:15 PM
తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. రైతులకు బీజేపీ ఓ శనిలా తయారైందని విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 9: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు బీజేపీ ఓ శనిలా తయారైందని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు.. ప్రధాని మోదీకి చెప్పి ధాన్యం కొనుగోలు చేయిస్తారని రైతులు ఎదురు చూశారని తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలతో రైతులకు ఎలాంటి లాభం లేదని వ్యాఖ్యానించారు. రైతుల ముందు మోదీనే మోకరిల్లిన చరిత్రను బీజేపీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు.
నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్న చరిత్ర మోదీది అంటూ వీరేశం వ్యాఖ్యానించారు. 15వ తేదీలోపు రాష్ట్రంలో ప్రతి గింజా కొనుగోలు చేస్తామని బీజేపీ ప్రకటించాలని.. లేదంటే బీజేపీ నాయకుల ఇళ్లు ధాన్యంతో నిండిపోతాయన్నారు. రైతుల కోపానికి బీజేపీ బలికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసేది బీజేపీ అయితే.. బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్‌ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం లేకున్నా పెద్ద ఎత్తున పంట వస్తే అసత్య రాజకీయ క్రీడకి తెరలేపారంటూ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
కిమ్స్ ఆస్పత్రికి డిప్యూటీ సీఎం పవన్.. బాధితులకు పరామర్శ
హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
Read Latest Telangana News And Telugu News