యాదాద్రి ప్లాంట్‌ను ఎందుకు పూర్తి చేయలేదు?
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:52 AM
పదేళ్లు అధికారంలో ఉండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిలదీశారు.
పదేళ్లు కమీషన్లు ఏరుకోవడం తప్ప విద్యుత్తు మంత్రిగా ఏనాడైనా సమీక్ష చేశావా?
జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వ విప్ వీరేశం ధ్వజం
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిలదీశారు. కమీషన్లు ఏరుకోవడం తప్ప విద్యుత్తుశాఖ మంత్రిగా ఏనాడైనా సమీక్ష చేశావా అని ప్రశ్నించారు. చేసిన విధ్వంసం, నష్టాన్ని కప్పి పుచ్చుకునే ఆరాటంలో ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం జగదీశ్ రెడ్డి చేస్తున్నాడని, తన మాటలతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడన్నారు. ఆదివారం సీఎల్పీ మీడియా హాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
‘యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం విదేశాల నుంచి బొగ్గు దిగుమతికి ఒప్పందాలు చేసుకున్నది.. ప్రతిమ గ్రూప్‌కు బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించి 50 ఏళ్లలో రూ.లక్ష కోట్లు కట్టబెట్టే ప్రయత్నం చేసింది నిజం కాదా? పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యయం అంచనాలు పెంచింది వాస్తవం కాదా? ఎక్కువ ధరకు ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నది బీఆర్ఎస్ సర్కారు కాదా? దీని వెనకున్న లోపాయికారి ఒప్పందం ఏంటి?’ అంటూ నిలదీశారు.
ఈ అక్రమాలు బయటికి వస్తాయన్న భయంతోనే జగదీశ్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుల కుప్ప తెలంగాణను ప్రజలకు ఇచ్చి, ఆస్తులు మాత్రం బీఆర్ఎస్ నేతలు సంపాదించుకున్నారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి నల్లగొండ జిల్లాకు ఆయన ఒక శాపంగా మారాడంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేసిన బీఆర్ఎస్ నేతలు.. నీళ్లు ఎత్తిపోయాలంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని అనిల్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేటీఆర్.. నీ దొంగ ఏడుపులు చాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News