Share News

ఆ విషయాన్ని సీఎం రేవంత్ ముందే ప్రకటించారు: వేముల వీరేశం

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:31 PM

రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నాయకుడు రేవంత్ అని అన్నారు.

ఆ విషయాన్ని సీఎం రేవంత్ ముందే ప్రకటించారు: వేముల వీరేశం
Vemula Veeresham

హైదరాబాద్, ఏప్రిల్ 18: మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఉందా అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందదని తెలిసి కూడా పార్లమెంట్‌లో పెట్టడం కుట్ర కాదా అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల తరపున సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ కుట్రలను రేవంత్ పసిగట్టి ఛేదిస్తున్నారన్నారు. రేవంత్ విజన్ ఉన్న నాయకుడంటూ కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నాయకుడు రేవంత్ అని అన్నారు. ఇండియా కూటమి ఏకమై దేశాన్ని కాపాడిందని ప్రభుత్వ విప్ తెలిపారు.


మోదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ప్రభుత్వ విప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను బానిసత్వంలోకి నెట్టాలన్న మోదీ కుట్రలు భగ్నమయ్యాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను, పార్టీలను రేవంత్ మేల్కొలిపారని తెలిపారు. డీలిమిటేషన్, మహిళా బిల్లు వేరువేరని రేవంత్ మొదటి నుంచి చెప్పారని.. రెండు బిల్లులు కలిపి తెస్తే ఆగిపోతాయని రేవంత్ ముందే ప్రకటించారని అన్నారు. మోదీ కుట్రలతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ హెచ్చరించారన్నారు.


బీజేపీ కుట్రలను నివారించడంలో ఇండియా కూటమి విజయం సాధించిందని వీరేశం తెలిపారు. బీజేపీ కుట్రలను ఛేదించడంలో రాహుల్ సక్సెస్ అయ్యారన్నారు. 2023 మహిళా బిల్లును అమలు పరచడానికి ఏం నొప్పి అంటూ మండిపడ్డారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ కుట్రలు చేశారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ కమిటీలో మహిళలను ఎందుకు తీసుకోలేరని ప్రశ్నించారు. మహిళల పట్ల చిత్తశుద్ధి లేని పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు మహిళలను వంటింటి కుందేళ్లలాగే చూస్తారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే బిల్లు పెట్టినట్టు ప్రధాని మోదీ ఒప్పుకున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పార్లమెంట్‌లో జాతికి విద్రోహం.. మహిళలకు అన్యాయం: సీఎం చంద్రబాబు

హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్: అమెరికాపై ఇరాన్ ఆగ్రహం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 04:48 PM