Share News

బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తాం: వీహెచ్

ABN , Publish Date - Aug 22 , 2026 | 02:41 PM

దేశంలో బడుగుబలహీన వర్గాల రిజర్వేషన్ కొనసాగుతోందని.. ఇప్పుడు ఆ రిజర్వేషన్ అమలు జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆరోపణలు గుప్పించారు.

బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తాం: వీహెచ్
V Hanumantha Rao

హైదరాబాద్, ఆగస్టు 22: దేశంలో బడుగుబలహీన వర్గాల రిజర్వేషన్ కొనసాగుతోందని.. ఇప్పుడు ఆ రిజర్వేషన్ అమలు జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆరోపణలు గుప్పించారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ‘60 శాతం జనాభా ఉన్న మా రిజర్వేషన్‌ను ఎలా ఎత్తివేస్తారో చూస్తాం’ అని అన్నారు. రిజర్వేషన్ ఎత్తివేయాలని ధర్నా చేయడం దారుణమని మండిపడ్డారు. దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆరోపించారు.


తెలంగాణ నుంచే ఉద్యమం మొదలవుతుందని వీహెచ్ అన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి.. బీసీల పక్షపాతి అని తెలిపారు. వచ్చే సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఈ ధర్నా కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు తెస్తే తాము అడ్డుపడలేదని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకే తెలంగాణలో కులగణన జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 02:52 PM