Share News

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

ABN , Publish Date - Apr 01 , 2026 | 08:42 AM

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

  • బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు

ఉప్పల్‌(సికింద్రాబాద్): ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఉప్పల్‌ ఫైఓవర్‌కు తన అన్న పేరును పెడుతూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై ఆయన సోదరుడు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం ఉప్పల్‌ క్రాస్‌రోడ్డుకు తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు.


ఈ సందర్భంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌కు మా అన్న రాజిరెడ్డి పేరు పెట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారని, ఆయనకు మా కుటుంబం ఎప్పటికి రుణపడి ఉంటుందన్నారు. తన అన్న బండారి రాజిరెడ్డి ఎంతో నిజాయితీగా పేదల కోసం పని చేయడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డాడని, ఇది ఆయనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్పించిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాజిరెడ్డి కాప్రా మున్సిపల్‌ చైర్మన్‌గా ఉప్పల్‌ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత మొదటి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం అభివృద్ధికి నిస్వార్థంగా సేవ చేశారని ఆయన పేర్కొన్నారు.


city4.2.jpgఅంతకు ముందు ఉప్పల్‌ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌, సాయిజెన్‌శేఖర్‌, పన్నాల దేవేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఫ్లైఓవర్‌కు ఆయన పేరు పెట్టి బండారి కుటుంబం కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచేలా చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో సంబ రాల్లో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం

Read Latest Telangana News and National News

Updated Date - Apr 01 , 2026 | 08:42 AM