సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులను స్వదేశానికి తీసుకురండి: కూనంనేని
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:39 AM
సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా, జెడ్డా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా, జెడ్డా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గత రెండు వారాలుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దేశం నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన సుమారు 4 వేలమంది యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రికులను తీసుకెళ్లిన ఏజెంట్లు తిరుగు ప్రయాణంలో చేతులెత్తేయడంతో టిక్కెట్లు కొనుగోలు చేయలేని యాత్రికులు ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ప్రధాన మంత్రి తక్షణం స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
హోంగార్డుల బకాయిలు వెంటనే చెల్లించాలి: జాన్‌వెస్లీ
రాష్ట్రంలో అరకొర వేతనాలతో ఎలాంటి సదుపాయాలు లేకుండా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డులను ప్రభుత్వం మానవీయ కోణంలో ఆదుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. హోంగార్డులుగా పని చేస్తూ పదవీ విరమణ చేసినవారు, మరణించిన వారి బకాయిలు చెల్లించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ రాశారు. గత 30 ఏళ్లుగా హోంగార్డులుగా సేవలందించి పదవీ విరమణ తరువాత పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర పదవీ విరమణ ప్ర యోజనాలు అందుకోలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం 10 వేలమంది హోం గార్డుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
2027 జూన్ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి
హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News