Share News

‘అమ్మకు అక్షరమాల’పై వయోజన మహిళల ఆసక్తి

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:04 AM

రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంపై స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఏళ్ల తరబడి అక్షరాలకు దూరంగా ఉన్న వయోజన మహిళలు ఇప్పుడు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు.

‘అమ్మకు అక్షరమాల’పై వయోజన మహిళల ఆసక్తి
Seethakka

  • ఉల్లాస్‌ పరీక్షకు 6.32లక్షల మంది హాజరు

  • ఇందులో ఉత్తీర్ణులైన వారికి పదోతరగతి పరీక్షరాసే అవకాశం: సీతక్క

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంపై స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఏళ్ల తరబడి అక్షరాలకు దూరంగా ఉన్న వయోజన మహిళలు ఇప్పుడు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు అక్షరాలను గుర్తించలేని స్థితి నుంచి చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్చుకున్న మహిళలు ఉల్లాస్‌ పరీక్షకు ఉత్సాహంగా హాజరయ్యారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసె్‌సమెంట్‌ టెస్ట్‌కు 6.32 లక్షల మంది వయోజన మహిళలు హాజరయ్యారు.


ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 5.32 లక్షల మంది మహిళలు, పట్టణ ప్రాంతాల్లో లక్షమంది పరీక్ష రాశారు. 2025-26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో ప్రభుత్వం ఉల్లాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 13 లక్షల మంది వయోజన మహిళా నిరక్షరాస్యులకు 100 రోజులపాటు విద్యాకేంద్రాల్లో ఈ ఏడాది శిక్షణ అందించారు. కాగా, ఉల్లాస్‌ పరీక్షరాసిన ఎస్‌హెచ్‌జీ, ఇతర వయోజన మహిళలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. ఉల్లాస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు పదోతరగతి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం

రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:04 AM