రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:54 AM
రాష్ట్ర ప్రజలు ఓట్లేసి రేవంత్‌ను సీఎం చేస్తే, ఆయన మాత్రం సోనియా కుటుంబం కోసం ప్రాణాలర్పిస్తారా?.. అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రజల కంటే సోనియా కుటుంబమే ఆయనకు ప్రాధాన్యంగా మారిందని విమర్శించారు.
రాహుల్‌గాంధీని చూస్తే జాలేస్తోంది: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు ఓట్లేసి రేవంత్‌ను సీఎం చేస్తే, ఆయన మాత్రం సోనియా కుటుంబం కోసం ప్రాణాలర్పిస్తారా?.. అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రజల కంటే సోనియా కుటుంబమే ఆయనకు ప్రాధాన్యంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ సహా హిమాచల్, కర్ణాటక రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీసి, అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ధైర్యముంటే, ఆయా రాష్ట్రాల్లో మళ్లీ పోటీ చేసి గెలవాలని రాహుల్‌గాంధీకి సవాల్ విసిరారు.
ఆదివారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ వైఖరిని చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. తాము ఓట్లను చోరీ చేయమని, ప్రజల మనసులను గెలుచుకుంటామని.. అందుకే జనం పదేపదే బీజేపీని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ఓడిపోతే ప్రజాతీర్పును అవమానిస్తూ.. గెలిస్తే మాత్రం సమర్థతగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. యూపీ, బెంగాల్, బిహార్, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో అంతర్గతంగా చర్చలు సహజమని అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కమిషన్ సభ్యులు స్పష్టత ఇచ్చాక విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌తో పాటు నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడమే కాకుండా.. విజయం సాధిస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మన్మోహన్ పేరుతో యూనివర్సిటీ పెట్టాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News