Share News

మన్మోహన్‌ పేరుతో యూనివర్సిటీ పెట్టాం

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:46 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విగ్రహావిష్కరణపై ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్యన ఎక్స్‌లో ట్వీట్‌-రీట్వీట్‌లు సాగాయి.

 మన్మోహన్‌ పేరుతో యూనివర్సిటీ పెట్టాం
Revanth Reddy

  • ఈ సారి వచ్చినప్పుడు కొత్తగూడెంలోని

  • మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌సైన్స్‌ వర్సిటీని చూడండి

  • ఎక్స్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయి ట్వీట్‌కు సీఎం రేవంత్‌ రీ ట్వీట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విగ్రహావిష్కరణపై ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్యన ఎక్స్‌లో ట్వీట్‌-రీట్వీట్‌లు సాగాయి. శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మన్మోహన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని రాజ్‌దీప్‌ సర్దేశాయి ఎక్స్‌లో పేర్కొంటూ.. మన్మోహన్‌ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తించడం సంతోషమేనని, అయినప్పటికీ ఆయన పేరుతో యూనివర్సిటీ లేదా కళాశాల ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్‌ ఎక్స్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు.


దీనిపై సీఎం స్పందిస్తూ.. తాము ఇప్పటికే రాష్ట్రంలో 2025 డిసెంబరు 2న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని కొత్తగూడెంలో ప్రారంభించామని తెలిపారు. ఎర్త్‌ సైన్స్‌, మైనింగ్‌, పర్యావరణ రంగంలో విద్యార్ధులకు యూజీ, పీజీ కోర్సులు అందించే దేశంలోనే తొలి యూనివర్సిటీ ఇదేనని పేర్కొన్నారు. మీరు ఈ సారి తెలంగాణకు వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీని సందర్శించాలని ఆహ్వానిస్తూ.. రాజ్‌దీప్‌ ట్వీట్‌కు సీఎం రేవంత్‌ రీ ట్వీట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రూ.20 వేలతో మొదలు... రూ.3.73 కోట్లు స్వాహా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 05:47 AM