దోస్త్‌లో 53,967 మందికి సీట్లు
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:58 AM
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది.
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. 53967 మందికి సీట్లు కేటాయించామని డిగ్రీ విద్య కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.
ఇందులో 23516 మంది కామర్స్, 10988 మంది ఫిజికల్ సైన్స్, 10316 మంది లైఫ్ సైన్స్, 9116 మంది ఆర్ట్స్, 31 మంది ఇతర కోర్సుల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు శనివారం(ఆగస్టు1)లోపు రూ.500 చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, లేకపోతే సీటు రద్దు అవుతుందని చెప్పారు.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు