గిరిజన ఆరోగ్య సంరక్షణలో కొత్త అధ్యాయం
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:10 AM
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి సేవలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జనజాతీయ గౌరవ పక్షోత్సవాలు-2026’ ఆదివారం ప్రారంభమయ్యాయి.
సంప్రదాయ వైద్యులకు జాతీయస్థాయి శిక్షణ
జన జాతీయ గౌరవ పక్షోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి సేవలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జనజాతీయ గౌరవ పక్షోత్సవాలు-2026’ ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కన్హాశాంతి వనంలో గిరిజన సంప్రదాయ వైద్యులకు జాతీయస్థాయి ప్రజారోగ్య అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గిరిజన సంప్రదాయ వైద్యుల సామర్థ్యాలను పెంపొందించడం, వారి దేశీయ వైద్య పరిజ్ఞానాన్ని ఆధునిక ప్రజారోగ్య వ్యవస్థతో మమేకం చేయడం దీని లక్ష్యం.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, ఐసీఎంఆర్-ఎన్‌ఐహెచ్‌ఆర్ (భువనేశ్వర్) ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ దృష్టి- జన్‌హిత్’ కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రారంభ సమావేశంలో ‘జన్‌హిత్’ డిజిటల్ వేదికను ప్రారంభించారు. ‘ప్రాజెక్ట్ దృష్టి’లో సేకరించిన సమాచారాన్ని డిజిటల్ రూపం లో నమోదు చేయడం, పర్యవేక్షించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సంప్రదాయ గిరిజన వైద్యులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News