Share News

సీఎం సహాయ నిధికి ట్రెసా రూ.5 లక్షల విరాళం

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:00 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రభుత్వ సహాయక చర్యలకు తోడ్పాటు ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల విరాళం ఇచ్చింది.

సీఎం సహాయ నిధికి ట్రెసా రూ.5 లక్షల విరాళం
TRESA

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రభుత్వ సహాయక చర్యలకు తోడ్పాటు ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల విరాళం ఇచ్చింది. ఈమేరకు బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని కలిసి ట్రెసా అధ్యక్షుడు గౌతం కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు చెక్‌ను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఉద్యోగి సామాజిక బాధ్యత అని ట్రెసా అధ్యక్షుడు గౌతం పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా రెవెన్యూ మంత్రికి ట్రెసా తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 07:01 AM