Share News

నిరుద్యోగులకు ‘టామ్‌ కామ్‌’ కుచ్చుటోపీ

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:07 AM

విదేశాలలో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టే లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ‘టామ్‌ కామ్‌’తో అనేకమంది నిరుద్యోగులు మోసపోయారని మానవ హక్కుల వేదిక పేర్కొంది.

నిరుద్యోగులకు ‘టామ్‌ కామ్‌’ కుచ్చుటోపీ
TOMCOM

  • మానవ హక్కుల వేదిక

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విదేశాలలో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టే లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ‘టామ్‌ కామ్‌’తో అనేకమంది నిరుద్యోగులు మోసపోయారని మానవ హక్కుల వేదిక పేర్కొంది. ఇలా ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే అభ్యర్థులు మోసపోతున్న వైనంపై తాము నిజ నిర్ధారణ జరిపామని తెలిపింది. మెకట్రానిక్స్‌, ఎలక్ర్టానిక్స్‌ వంటి రంగాల్లో జర్మనీలో ఉద్యోగాలు ఉన్నాయని టామ్‌కామ్‌ ఆకర్షణీయమైన కరపత్రాన్ని విడుదల చేసి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 4 లక్షలకు పైగా వసూలు చేసిందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్‌. జీవన్‌ కుమార్‌, తెలంగాణ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 07:07 AM