Share News

టీజీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:07 PM

దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను కార్మిక శాఖ శుక్రవారం విడుదల చేసింది.

టీజీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

హైదరాబాద్, సెప్టెంబర్18: దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను కార్మిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 9వ తేదీన ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 17వ తేదీన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. సోమవారం నుంచి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.


  • 2026, సెప్టెంబర్18: ఎన్నికల షెడ్యూల్ జారీ.

  • సెప్టెంబర్ 21: ఎన్నికల్లో పోటీ చేసేందుకు యూనియన్ల సమ్మతి.

  • సెప్టెంబర్ 22: యూనియన్లకు ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ.

  • సెప్టెంబర్ 24: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల దాఖలు.

  • సెప్టెంబర్ 25: యూనియన్లకు ఫైనల్ ఓటర్ల జాబితా.

  • సెప్టెంబర్ 26: యూనియన్లకు గుర్తుల కేటాయింపు.

  • సెప్టెంబర్ 26: రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫైనల్ ఓటర్ల లిస్ట్.


  • సెప్టెంబర్ 29: యూనియన్లకు డమ్మీ బ్యాలెట్ పేపర్లు.

  • అక్టోబర్ 9: పోలింగ్.. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

  • అక్టోబర్ 14,15: పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు.

  • అక్టోబర్ 17: ఫలితాల ప్రకటన

  • ఈ ఎన్నికలు టీజీఎస్ ఆర్టీసీలో మెజారిటీ యూనియన్‌ను నిర్ణయించి.. గుర్తింపునివ్వనున్నారు.

  • డాక్యుమెంట్ రెండో పేజీలో ఈ షెడ్యూల్‌ను11 కార్మిక సంఘాలకు కార్మిక శాఖ పంపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్

దానంకు పట్టిన గతే.. మిగతా ఎనిమిది మందికీ పడుతుంది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 06:32 PM