ఇకపై ఆ ఇంక్రిమెంట్ రద్దు.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:12 PM
ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు సంబంధించి యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ అయ్యింది.
హైదరాబాద్, మార్చి 18: ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇకపై ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నా ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది.
ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద స్పెషల్ క్యాజువల్ లీవ్ మాత్రమే కొనసాగుతుందని తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఇవి కూడా చదవండి...
గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన
రింగ్ మాస్టర్లుగా అధికారులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News