Share News

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన

ABN , Publish Date - Mar 18 , 2026 | 10:12 AM

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్నలతో గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన
BRS leaders

హైదరాబాద్, మార్చి 18: గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ శ్రవణ్, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మార్కెట్లకు పోటెత్తిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో రైతన్నకు తిప్పలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్ నేతలు నినాదాలు చేశారు. మొక్కజొన్నలతో గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన గులాబీ పార్టీ నేతలు.. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.


ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 8 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలను పండించారని, మద్దతు ధర లేకపోవడంతో పాటు వర్షాల కారణంగా అన్నదాతలు నష్టపోతున్నారని తెలిపారు. 25 శాతం పంట.. దళారుల చేతికి వెళ్లిందని అన్నారు. పంటల బీమా అమలు చేయడం లేదని విమర్శించారు. వడగండ్ల వానతో రైతులు నష్టపోయారన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని... వెంటనే ఇవ్వాలన్నారు. రూ.2400 మద్దతు ధర.. రూ.500 బోనస్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 11:16 AM