ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Mar 18 , 2026 | 09:12 AM
తిరుపతి ఎమ్మెల్యేల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, మార్చి 18: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అంటూ ఈ సమావేశంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీడీపీలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని.. ఎవరికీ వెసులుబాటు ఉండదని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
For More AP News And Telugu News