Share News

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:45 AM

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు
Robbery

కృష్ణా జిల్లా, మార్చి 18: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్(Kathari Eshwar Kumar) ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగులగొట్టి దుండగుడు చోరీకి తెగబడ్డాడు. కఠారి భార్య మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లి బుధవారం తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. చోరీలో వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురయ్యాయని తెలుస్తోంది.


వెంటనే గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు మధురిమ ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీంకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కఠారి ఈశ్వర్ కుమార్ వ్యాపారం రీత్యా హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్నారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

బడ్జెట్‌ 3.20 లక్షల కోట్లు!?

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 10:05 AM