Share News

రింగ్‌ మాస్టర్లుగా అధికారులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:47 PM

ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడిపిస్తున్నారంటూ అధికారులపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తున్నారని ఆయన విమర్శించారు

రింగ్‌ మాస్టర్లుగా అధికారులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR

హైదరాబాద్, మార్చి 18: ప్రభుత్వ అధికారులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడిపిస్తున్నారని.. అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని అన్నారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్ అధికారి, ఐఏఎస్ నర్సింహారెడ్డి.. కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి నువ్వెవరివి?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వాన్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ‘కుక్క తోకను ఊపట్లేదు.. తోకే కుక్కను ఊపుతున్నట్లుంది అధికారులు, మంత్రుల తీరు’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై విరుచుకుపడ్డారు. 57 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని భట్టి సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘అది నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తాను.. నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్‌పై సభలో మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను అసెంబ్లీలో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 02:51 PM