Share News

లైన్ల తనిఖీకి డ్రోన్లు వాడాలి: జితేష్‌పాటిల్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:19 AM

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, డ్రోన్‌ టెక్నాలజీని కేవలం ఇంజనీర్లకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతీ లైన్‌మన్‌తో సహా సిబ్బంది ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు.

లైన్ల తనిఖీకి డ్రోన్లు వాడాలి: జితేష్‌పాటిల్‌
Drone Technology in Power

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, డ్రోన్‌ టెక్నాలజీని కేవలం ఇంజనీర్లకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతీ లైన్‌మన్‌తో సహా సిబ్బంది ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. కల్యాణ్‌నగర్‌ స్కాడాలో రెండురోజుల పాటు అర్రిసెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గోగ్‌ సర్వీసెస్‌ సంస్థల సహకారంతో నిర్వహించిన మూడు రోజుల డ్రోన్‌ పైలట్‌ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది.


శిక్షణలో సుమారు 50 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా, శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న 40 మందికి సీఎండీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాధారణంగా ఒక లైన్‌మ్యాన్‌ నిచ్చెన సహాయంతో విద్యుత్‌ లైన్లపై ఉన్న ఇన్సులేషన్‌ను తనిఖీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కూడా కష్టమవుతుందని పేర్కొన్నారు. డ్రోన్ల సహాయంతో ఇన్సులేషన్‌ పరిస్థితిని సులభంగా పరిశీలించడంతో పాటు కేబుళ్లపై బలహీనమైన ప్రాంతాలు, సమస్యాత్మక పాయింట్లను గుర్తించవచ్చని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:19 AM