Share News

టీజీఎంఎస్ఐడీసీలో వసూల్‌ రాజాపై వేటు

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:41 AM

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) డ్రగ్‌ విభాగంలో పనిజేసే ఓ ఫార్మాసిస్టుపై సంస్థ ఎండీ గౌరవ్‌ ఉప్పల్‌ వేటు వేశారు.

టీజీఎంఎస్ఐడీసీలో వసూల్‌ రాజాపై వేటు
TGMSIDC

  • ఇద్దరు కీలక అధికారులకు కలెక్షన్‌ ఏజెంట్‌?

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) డ్రగ్‌ విభాగంలో పనిజేసే ఓ ఫార్మాసిస్టుపై సంస్థ ఎండీ గౌరవ్‌ ఉప్పల్‌ వేటు వేశారు. బుధవారం ఆ ఫార్మసిస్టును సంస్థ నుంచి రీలివ్‌ చేశారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి సరెండర్‌ చేశారు. సదరు ఫార్మాసిస్టు.. సంస్థలో పనిజేసే ఇద్దరు కీలక అఽధికారులకు కలెక్షన్‌ ఏజెంట్‌గా వ్యవహారిస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రాథమిక విచారణ అనంతరం ఆ ఫార్మాసిస్టును తొలగించాలంటూ సంస్థ ఎండీకి ఆదేశాలు వెళ్లాయి. సదరు ఫార్మాసిస్టు కార్పొరేషన్‌లో రెండేళ్లుగా పనిజేస్తున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. గతంలో హైదరాబాద్‌, నల్లగొండ సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌లో ఆయన పనిజేశారు. ఆ సమయంలోనూ ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలొచ్చాయి.


అయినప్పటికీ అధికారులు మళ్లీ కార్పొరేషన్‌లో కీలక విభాగంలో అవకాశం కల్పించినట్లు సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఫైనాన్స్‌ విభాగంలో పనిజేసే ఒక అధికారితో పాటు కీలక వ్యవహారాలను చక్కబెట్టే మరో అధికారికి సదరు ఫార్మాసిస్ట్‌ వసూళ్లు చేసిపెడుతున్నట్లు సమాచారం. కాగా వర్క్స్‌ అండ్‌ అకౌంట్‌ విభాగం నుంచి ఐదేళ్ల క్రితం ఫైనాన్స్‌ సెక్షన్‌కు ఫారీన్‌ సర్వీస్‌ డిప్యూటేషన్‌ (ఎఫ్‌ఎస్‌డీ)పై ఓ అధికారి వచ్చారు. వాస్తవానికి ఆయన డిప్యూటేషన్‌ ఈ ఏడాది మార్చితోనే ముగిసినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయు. తదుపరి కొనసాగింపు ఉత్తర్వ్యులు ఇంకా రాలేదు. అయినప్పటికీ సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏడు నెలలుగా ఔషధ కార్పొరేషన్‌లో కీలక విభాగంలో పనిజేస్తున్నారు. ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లే ఆయన కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కండక్టర్‌ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ!

7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:41 AM