ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్
ABN , Publish Date - May 20 , 2026 | 03:24 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్ నేత స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.
హైదరాబాద్, మే 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్ నేత స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు సిట్ గుర్తించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతను విచారణకు పిలిచిన సిట్ అధికారులు.. స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ట్యాప్ చేశారని సిట్ అధికారులు చెప్పారని తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.
ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని సిట్ చెప్పిందని కాంగ్రెస్ నేత అన్నారు. ట్యాప్ విషయాన్ని నిర్ధారిస్తూ ఆధారాలు చూపించారని తెలిపారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారన్న విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. అధికార దాహం కోసం కేసీఆర్ ఎంతటి నేరానికైనా పాల్పడతారని మండిపడ్డారు. సొంత చెల్లి ఫోన్‌ను కూడా కేటీఆర్ ట్యాప్ చేయించారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు త్వరలోనే జైలుకెళ్తారని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి
యువతి కిడ్నాప్ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
Read Latest Telangana News And Telugu News