వారమైనా తెరుచుకోని టీజీఐపాస్ పోర్టల్!
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:48 AM
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన టీజీఐపాస్ వెబ్‌సైట్ సైబర్ దాడికి గురై వారం గడుస్తున్నా.. ఇంకా అందుబాటులోకి రాలేదు.
రెండు రోజుల్లోనే అందుబాటులోకి తెస్తామని చెప్పిన అధికారులు..
ఇప్పటికీ స్పష్టత కరువు
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన టీజీఐపాస్ వెబ్‌సైట్ సైబర్ దాడికి గురై వారం గడుస్తున్నా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నెల 22న వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పరిశ్రమల శాఖ అధికారులు.. ప్రభుత్వానికి, పరిశ్రమలకు సంబంధించిన డేటా సురక్షితంగానే ఉందని ప్రకటించారు.
భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన ఫైర్‌వాల్ వ్యవస్థను ఏర్పాటు చేసి వెబ్‌సైట్‌ను రెండు రోజుల్లోనే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. కానీ, వారం గడిచినా వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. అసలు పునరుద్ధరణ ప్రక్రియ ఏ దశలో ఉంది? సాంకేతికంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? సేవలను తిరిగి ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? అనే అంశాలపై స్పష్టత కరువైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News