ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కార్ గుడ్‌న్యూస్
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:47 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. బేస్‌మెంట్ లేదా పైస్థాయికి చేరిన ఇళ్లకు వన్‌టైమ్ ద్వారా క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అర్హత ఉన్న నిర్మాణాల్లో నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు.
ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో L3 మంజూరులకు ఈ సడలింపు వర్తించదని తెలిపారు. సడలింపుతో ఏర్పడే ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తున్నామని.. రద్దైన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ
ఏబీఎన్ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం.. ఎంజీఎంకు కలెక్టర్
Read Latest Telangana News And Telugu News