Share News

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తేసిన తెలంగాణ హైకోర్టు

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:39 PM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తేసిన తెలంగాణ హైకోర్టు
Telangana High Court

హైదరాబాద్, సెప్టెంబర్ 1: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ ధర్మాసనం విధించిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర సర్కార్.. డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయగా.. ఈరోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సింగిల్ బెంచ్ స్టే విధించడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


ఈ పథకం వల్ల ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్‌లో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలిపారు. పథకం అమలుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన సీజే ధర్మాసనం.. స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు.. ఆర్ట్ డైరెక్టర్ కుమారుడి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 03:28 PM