రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు.. ఆర్ట్ డైరెక్టర్ కుమారుడి అరెస్ట్
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:48 PM
రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల
మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News