Share News

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. సెక్యూరిటీ అలర్ట్

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:01 PM

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ అలర్ట్‌ను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథంలో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. సెక్యూరిటీ అలర్ట్
Madras Regiment In Hyderabad

హైదరాబాద్, సెప్టెంబర్ 01: కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ అలర్ట్‌ను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథంలో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ చోరీ జరిగిన ఆయుధాల గదిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మంగళవారం పరిశీలించారు. ఈ చోరీ కేసును నిగ్గు తేల్చడానికి ఆరు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.


ఈ చోరీపై మద్రాస్ రెజిమెంట్ బ్రిగేడియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 331,305 కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకేసారి ఈ ఆయుధాల చోరీ జరిగిందా? లేకుంటే విడతల వారిగా వీటిని చోరీ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో వైపు ఈ చోరీ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మద్రాస్ రెజిమెంట్‌కు ఆర్మీ ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే చేరుకుంది.


అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధ గదిలో భారీగా ఆయుధాలతోపాటు మందుగుండి సామాగ్రి చోరీ జరగడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మాయమైన ఆయుధాల్లో నాలుగు ఏకే 47 తుపాకులతోపాటు వాటికి సంబంధించిన ఆరు మ్యాగజైన్లు మాయమయ్యాయి. ఈ ఆరు మ్యాగజైన్లో 756 బుల్లెట్లు ఉంటాయి.


చోరీకి గురైన వాటిలో ఓ ఇన్సాస్ రైఫిల్.. దానికి సంబంధించిన మూడు మ్యాగజైన్లు మాయం ఉన్నాయి. చోరీకి గురైన వాటిలో ఆరు రైఫిళ్లతో పాటు బైనాక్యులర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆయుధాలతో పాటు లైవ్ రౌండ్ బుల్లెట్లు బాక్స్ మాయం కూడా ఉన్నట్లు కనుగొన్నారు. బాక్స్‌లో 1200 లైవ్ రౌండ్ బుల్లెట్లు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎన్‌జీ బంకులో ఊహించని ప్రమాదం.. వీడియో వైరల్

తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

For More TG News And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 01:10 PM