రెండు రోజులుగా వర్షాలు.. అధికారులు అందరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:17 PM
తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, జులై 30: తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలు, ఆర్ అండ్ బీ డివిజన్ల వారీగా రోడ్లు, బ్రిడ్జిలు, లో కాజ్‌వేలు, కల్వర్టుల వివరాలపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కల్వర్టులు, లో కాజ్‌వేలు, కోతకు గురైన రోడ్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశించారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రోడ్లు, బ్రిడ్జిల వద్ద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతి రోజు ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని, క్షేత్రస్థాయి ఇంజినీర్లతో మొబైల్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని వెల్లడించారు. ఈఎన్సీ నుంచి ఏఈ వరకూ అందరు పూర్తి అలెర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
రెండు దఫాలుగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
‘నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు’.. జూబ్లీహిల్స్ సీఐపై బాధితురాలి ఆరోపణ
Read Latest Telangana News And Telugu News