Share News

ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Jun 15 , 2026 | 10:18 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్‌ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ వ్యాప్తంగా ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్’ పథకం ప్రారంభమైంది. ఈరోజు(సోమవారం) ఉదయం రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులకు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రి.. వారికి పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్‌ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. వారంలో 6 రోజులు మంచి బ్రేక్ ఫాస్ట్ పాలు, రాగి జావాను అందిస్తున్నామని.. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.


విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్లో చదివితేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే రోజులు రానున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూల్ వద్దు అనే భావన ఉందన్నారు. దాన్ని తొలగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.800 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..

ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన విద్యార్థి కరెంట్ షాక్‌తో మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 11:59 AM