ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన విద్యార్థి కరెంట్ షాక్‌తో మృతి
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:38 AM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లో 950 మార్కులు సాధించి ప్రతిభ చూపించిన ఓ విద్యార్థి మృతి చెందాడు. తండ్రికి సహాయం చేస్తూ విద్యుదాఘాతానికి గురై విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్, జూన్ 15: నగరంలోని మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లో 950 మార్కులు సాధించి ప్రతిభ చూపించిన ఓ విద్యార్థి మృతి చెందాడు. తండ్రికి సహాయం చేస్తూ విద్యుదాఘాతానికి గురై విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహేశ్ జాదవ్ అనే విద్యార్థి తన తండ్రికి సహాయం చేస్తూ చెరకు రసం దుకాణం వద్ద ఉన్నాడు. అదే సమయంలో మహేశ్ విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి... ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి హఠాన్మరణంతో స్థానికులు, స్నేహితులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..
Read Latest Telangana News And Telugu News