Share News

నేటి నుంచి కవిత సింగరేణి బాయిబాట

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:51 AM

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత.. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులకు చేరువయ్యేందుకు సోమవారం నుంచి బాయిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

నేటి నుంచి కవిత సింగరేణి బాయిబాట

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత.. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులకు చేరువయ్యేందుకు సోమవారం నుంచి బాయిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాయిబాట మొదటి విడతలో ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటించనున్నారు. అందులో సోమవారం చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని మందమర్రి బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్‌ పరిధిలో, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్‌జీ-1 ప్రాంతంలో, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్‌జీ-2 ప్రాంతాలకు వెళ్లనున్నారు. 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్ట్‌, ఆర్‌జీ-3 ప్రాంతంలో, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని బొగ్గు గనులు, ఓపెన్‌ కాస్ట్‌ గనులవద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో కవిత సమావేశం కానున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రతినిదులు వెల్లడించారు.

Updated Date - Jun 15 , 2026 | 04:51 AM